Huzurabad By Election: హుజురాబాద్ నామినేషన్లలో రాజేందర్ పేరుతో గందరగోళం..
Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.;
Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. శుక్రవారం చివరి రోజుకావటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు 46మంది నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి. ఇక ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13న నామినేషన్ల ఉపసంహరణ చేపట్టనున్నారు.
మరోవైపు హుజూరాబాద్‌లో రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో ఉండగా.. చివరి రోజున రాజేందర్ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరందరి ఇంటి పేరు కూడా E అక్షరంతోనే ప్రారంభమైంది. ఇమ్మడి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్ తమ నామినేషన్లు వేశారు. అయితే ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్ ఇలాంటి నామినేషన్స్ వేయించిందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్ బైపోల్ ఫైట్‌లో ఉండగా.. 43 మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్ వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.