Huzurabad By election: జమ్మికుంటలో ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతల ఆరోపణ.. పోలీసుల సోదాలు..
Huzurabad By election: జమ్మికుంటలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ దీప్తి కిషన్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.;
Huzurabad By election: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట 28వ వార్డులో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ దీప్తి కిషన్ రెడ్డి.. ఇంటి వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీస్ కమిషనర్.. ఇంట్లో సోదాలు చేసి ఎమ్మెల్యే ఇక్కడ లేరని తెలిపారు. కౌన్సిలర్ ఇంట్లో ఉన్న నాన్‌లోకల్ వాళ్లపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరోవైపు పోలీస్ కమిషనరే ఎమ్మెల్యేను తప్పించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.