Huzurabad by poll: హుజురాబాద్ బై పోల్.. పలు చోట్ల ఘర్షణలు..
Huzurabad by poll: హుజురాబాద్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.;
Huzurabad by poll: హుజురాబాద్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. వీణవంక మండలం ఘన్ముక్లలో హైటెన్షన్ నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీఆర్‌ఎస్ నేత కౌశిక్‌రెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేశారు.
కౌశిక్‌రెడ్డి ఎన్నికల కేంద్రంలో ప్రచారం ఎలా చేస్తారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అయితే.. తాను ఎన్నికల తీరును తెలుసుకునేందుకు వచ్చానని కౌశిక్‌రెడ్డి సమాధానమిచ్చారు. బీజేపీ శ్రేణులు, కౌశిక్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పోలీసులు కల్పించుకొని వివాదం పరిష్కరించారు.