డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్‌లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్‌తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ఉంటుందని సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్తెలిపారు ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సాహిత్య రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులను యాది చేసుకుంటూ బుక్ఫెయిర్ప్రాంగణానికి, వేదికలకు పేర్లు పెట్టినట్లు తెలిపారు. ప్రధాన ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభా కార్యక్రమాల వేదికకు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాధిక్ పేర్లను ఖరారు చేశామన్నారు.