Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ఎండీ సీరియస్ వార్నింగ్..

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించేవారికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు;

Update: 2022-09-22 15:07 GMT

Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించేవారికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకులు పోస్టర్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు. సెంట్రల్‌ మెట్రో రూల్స్‌ అమలు చేస్తామన్నారు. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు ఆరేళ్లు జైల్లో పెడతామన్నారు. గల్లీ లీడర్లే ఎక్కువ పోస్టర్లు అంటిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ పాడు చేయొద్దంటూ హితవుపలికారు. కాలుష్యం లేని ప్రయాణం కోసం హైదారాబాద్‌ మెట్రో రైళ్లు ఉపయోగపడుతున్నాయన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి.

Tags:    

Similar News