Hyderabad : హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
Hyderabad : హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని 34 ఎంఎంటీఎస్‌లు రద్దయ్యాయి.
Hyderabad : హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని 34 ఎంఎంటీఎస్‌లు రద్దయ్యాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ల సేవలను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మరో మూడు రోజులపాటు నగరంలో సాధారణ నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు కూడా సామాన్యులకు విజ్ణప్తి చేస్తున్నారు.