Hyderabad MIM : ఎంఐఎం నేత పై పీడీ యాక్ట్ కేసు నమోదు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..
Hyderabad MIM : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం నేత సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ పై పీడీ యాక్ట్ ప్రయోగించారు పోలీసులు
Hyderabad MIM : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం నేత సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు పోలీసులు.. కషఫ్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.. రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఓ వర్గంపై ట్విట్టర్ వేదికగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తూ జనాన్ని రెచ్చగొడుతున్నారని కషఫ్‌పై కేసులు నమోదయ్యాయి.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు కాగా, అందులో మూడు కేసులు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినవేనని పోలీసులు చెప్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను షేర్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కషఫ్ ప్రయత్నించినట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అంతేకాదు, కషఫ్ వ్యాఖ్యలతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు కూడా జరిగాయంటున్నారు.. ఈనెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ సీపీ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నాలోనూ కషఫ్ కీలక పాత్ర వహించాడు.