HYDRA Commissioner : కబ్జాలపై హైడ్రా సీరియస్

Update: 2025-03-28 09:00 GMT

ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వభూముల కబ్జాలపై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. గురువారం హైదారాబాద్ లోని పలు ప్రాంతా ల్లో క్షేత్రస్థాయిలో పరి శీలన చేశారు. మాదాపూర్లోని గుట్టల బేగంపేట, ఫిలింనగర్ కాలని లోని విష్పర్ వ్యాలి చెరువు, శంషా బాద్ లోని తొండపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను కమిషనర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులకు ఆటంకం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయడం, ప్రహరీలు నిర్మించి కాపాడుతామని తేల్చిచెప్పారు. బడంగ్ పేట్ మున్సిపాలిటీ అల్మాస్ గూడ గ్రామంలోని బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించారు.

లేఅవుట్ లోని సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహారీతో ఇతర ప్లాట్ల యజమానులకు మూసుకుపోయిన రహదారులు హైడ్రా తొలగించింది. లేఅవుట్ ప్రకారం 240 గజాలు ఉండాల్సిన పార్కులోని కబ్జాలను హైడ్రా అధికారులు తొలగించడంతో ఎర్క్లేవ్ ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. 1982లో గ్రామపంచాయతీ లే అవుట్ వేయగా 3 రహదారుల్లో లేఅవుట్ యజమానులు ఆటంకాలను సృష్టించారు. మూడు చోట్ల రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీలను హైడ్రా అధికారులు తొలగించారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ, అల్మాస్గూడ బోయపల్లి ఎన్క్రిప్ట్ కాలని వాసులు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశంసిస్తూ బోయనప ల్లి కాలనీ వాసులు హర్షతిరేకలు వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News