TG : అక్రమ బిల్డర్ల గుండెల్లో దడ.. రెండు రోజుల్లో 55 బిల్డింగ్స్ కూల్చిన హైడ్రా

Update: 2024-08-12 07:45 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట డివిజన్లో చెరువులు, రోడ్లు, వీధులను అక్రమంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివార కూల్చివేశారు. ముఖ్యంగా వైశాలీ నగర్ లోని ఎఫ్ఎఎల్ ల్యాండ్ లో మూడు అక్రమ భారీ బిల్డింగ్ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు.

శివరాంపల్లి, చందానగర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు భారీ పోలీసు బందోబస్తు సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో 55 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైఅధికారులు తెలిపారు. ముఖ్యంగా చందానగర్ సర్కిల్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన 3 అక్రమ నిర్మాణాలను, శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువులో కబ్జాకు గురైన 5 ఎకరాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు.

Tags:    

Similar News