కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలని, పదవుల పంపిణీలో ఎప్పుడూ నా జోక్యం ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఖమ్మం నియోజవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, ఖమ్మం నియోజకవర్గ పీసీసీ అబ్జర్వర్ నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కోరుకున్న విదంగా పదవుల పంపిణీ ఉంటుందన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి సమయం కేటాయించే వారిని నాయకులుగా తీర్చిదిద్దు తామన్నారు. 'కొంతమంది విజిటింగ్ కార్డ్లకే పరిమితం అయ్యారు. పార్టీ కోసమే పని చేసే వారికి అవకాశాలు ఇస్తం. ప్రతి కార్యకర్త ను ఆదుకుంటాం. అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పదవులను కేటాయించడం జరుగుతుంది.' అని నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.