కండిషనల్ బెయిల్‌పై ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడంపై ఐజీ సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను ప్రభావితం చేసే విధంగా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం సరైంది కాదన్నారు. అ విషయంలో బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరతామని ఐజీ చెప్పారు. లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తుగా ఏర్పాటు చేశాం. సురేష్ పథకం ప్రకారమే కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకెళ్లాడు. పోలీస్ నిఘా వైఫల్యం అనడం సరికాదు. ఫార్మా భూసేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు. కలెక్టర్‌పై దాడి కేసులోనే అరెస్టు చేశామని... ఈ కేసులో ఎవరినీ కొట్టలేదని ఐజీ వివరించారు. సురేష్ వాయిస్ రికార్డు తమ దగ్గర ఉందని... అతనే మొత్తం ప్లాన్ చేశాడని... సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు.