హైదరాబాద్ బంజారాహిల్స్ ఓ లగ్జరీ ఇంపోర్టెడ్ ఖరీదైన కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 14 లో కేబీఆర్ పార్క్ వద్ద అదుపు తప్పింది. ఫుట్ పాత్ పై దూసుకెళ్ళి , ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిది? డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా ప్రమాదం జరిగిందా ? లేదా అతివేగంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.