Bandi Sanjay : మరో మూడేళ్లలో ఇండియా ఎకానమీ నంబర్ త్రీ..బండి సంజయ్ కామెంట్స్
2028 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నారాయణపేట జిల్లా పర్యటన లో భాగంగా నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఆయన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్ వాడీ పిల్లలను ఊరి పేరు, మండలం, జిల్లా పేరు అడిగి వారితో జవాబు రాబట్టారు. పిల్లల ఆట వస్తువులను చూసి, పిల్లలికి ఇచ్చే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. వంటగది శుభ్రంగా ఉందని మెచ్చుకున్నారు.