KTR : రేషన్ కార్డులు ఇవ్వడం కూడా చారిత్రాత్మకమా? : కేటీఆర్

Update: 2025-01-27 17:00 GMT

'రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా..? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ సేవలో దరఖాస్తూ చేసుకుంటే 6 లక్షల 50 వేల కొత్త కార్డుల్ని ఇచ్చినం. మేం ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. గతంలో ఏ ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతు న్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్డులు ఇవ్వన ట్టు రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతుండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ను స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటీఆర్ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెసో గ్లోబెల్స్ వారసులన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏడాది దాటిన అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ డిక్లేరేషన్లు నాలుక గీసుకునేందుకు పనికి రావు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలి స్తామన్నారు.420 హామీలిచ్చి జనవరి 30 నాటికి 420 రోజులు అవుతుంది. కాంగ్రెసోళ్లు చెవిలో పువ్వు పెట్టారు. కాబట్టి చెవిలో పువ్వు పెట్టుకొని 30న మహాత్మా గాంధీకి వినతిపత్రం అందిస్తం. డూప్లికేట్ గాంధీలకు బుద్ది వచ్చేలా చేయాలని గాంధీని కోరుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహాన పెళ్లంట సినిమాలో లాగా కోడిని చూపెట్టి ఇదే చికెన్ అనేలా హామీల అమలులో మోసం చేస్తున్నరు. పెట్టుబడుల విషయంలో కేసీఆర్కు, నాకు ఏదో అజీర్తి అయినట్టు ఈనో ప్రకటనలు వే స్తున్నరు. సీఎం నిజంగా నువ్వు లక్షా ఎనభై కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టయితే సన్మానం చేస్తం. అపరిచితుడు సినిమాలో లాగా రాము, రెమో, అపరిచితుడిలాగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న డు. బీఆర్ఎస్ పదేండ్లలో తెలంగాణను దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దాం. ప్రైమరీ హైయర్ ఎడ్యుకే షన్గాకా విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం' అని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News