Jagga Reddy : అటెండర్ ఉద్యోగం ఇచ్చినా ఆనందంగా చేస్తా.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

Update: 2024-06-29 10:29 GMT

కాంగ్రెస్ అధిస్థానం అటెండర్ బాధ్యతలు అప్పగిం చినా చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన తనకు టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు తనతో సంప్రదింపులు జరపలేదని ఆయన స్పష్టం చేశారు.

అటెండర్ నుంచి పార్టీ చీఫ్ వరకు ఏలా ధ్యతలు ఇచ్చినా అంకిత భావంతో పని చేసానని ఆయన చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి ( Jagga Reddy ) మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ తాను ఆశిస్తున్నప్పటికీ ఏ బాధ్యతలు ఇచ్చిన గౌరవంగా స్వీకరిస్తానని చెప్పారు. భవిష్యత్ లో ముఖ్యమంత్రి కావాలనేదే తన లక్ష్యం అని జగ్గారెడ్డి చెప్పారు.

మోడీ అధికారం కోల్పోతే జీరో గా మిగులుతారని చెప్పారు జగ్గారెడ్డి. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పటికీ హీరోలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా రాజకీయ అధికారాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఉంటాయని చెప్పారు.

Tags:    

Similar News