తెలంగాణలో కొద్ది మందికే ఉద్యోగాలు ఉద్యోగాలు దొరికాయని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళలో ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులు, ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని... తమ ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలు, సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.