Telangana News : ఇక స్థానిక సమరం.. జూబ్లీ గెలుపుతో రేవంత్ నిర్ణయం

Update: 2025-11-17 14:00 GMT

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణలో స్థానిక ఎన్నికల రాజకీయాలకు కొత్త ఎనర్జీ ఇచ్చింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల తరువాత.. రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీ గెలుపుతో ప్రజల్లో తమకు వ్యతిరేతక లేదని.. మద్దతు పెరిగిందని.. కాబట్టి ఇప్పుడు వెళ్తే ఎక్కువ సీట్లు గెలుస్తామని రేవంత్ భావిస్తున్నారు.

జూబ్లీహిల్స్ విజయంతో ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందని, అనుకూలత పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ గెలుపు పార్టీకి ధైర్యం ఇచ్చిన పరిస్థితిలో ఇప్పుడు వెళ్తేనే ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించినా.. చట్టబద్ధంగా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఈ సారి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నిర్ణయం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మొత్తానికి, జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్‌లో కేవలం ఉత్సాహాన్ని మాత్రమే కాదు, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో దూకుడుకు కూడా మార్గం సుగమం చేసింది. పార్టీ పరంగా ఇస్తే అప్పుడు బీఆర్ ఎస్, బీజేపీలకు పెద్ద చిక్కు వస్తుంది. ఎటు చూసినా కాంగ్రెస్ కు లాభమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి డిసెంబర్ ఎండింగ్ లోపు ఎన్నికలు జరగబోతున్నాయి.

Tags:    

Similar News