తెలంగాణలో కాళేశ్వరం అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ అతి త్వరలోనే మొదలు కానుంది. కాళేశ్వరం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు.
జూన్ 30లోగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాల్సింది గా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. గత నెలలో కోల్కతాలో జస్టిస్ ఘోష్ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ నాగేందర్ రావు భేటీ అయ్యారు.
వాస్తవానికి ఉగాది అయ్యాక ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఐతే.. వివిధ కారణాలతో రాలేకపోయారు. లక్ష కోట్ల మేర అవినీతి జరిగిన ప్రాజెక్టుపై విచారణ అంటే సీరియస్గా ఉంటుందంటూ అధికారులతో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తికరంగా మారింది