Kangana Ranaut: హైదరాబాద్ లో చంద్రముఖి

చంద్రముఖి 2 సినిమా కోసం నగరానికి విచ్చేసిన కంగన; షూటింగ్ ప్రారంభం

Update: 2023-02-08 06:37 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. చంద్రముఖి 2 సినిమాలో అమ్మడు లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ షూటింగ్ నగరంలోనే జరుగనుంది. ఈ మేరకు మంగళవారమే అమ్మడు నగరంలో ల్యాండ్ అయింది. ఇందుకోసం ఇన్స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. చంద్రముఖి సెకండ్ షెడ్యూల్ కోసం మహానగరిలో అడుగుపెట్టినట్లు వెల్లడించింది. రజినీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సీక్వెల్ లో కంగన రాజుగారు మనసుపడిన చంద్రముఖి పాత్రలో తళుక్కుమననుందని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ కంగనకు జోడీగా లీడ్ రోల్ లో నటించనున్నాడు. రెండవ షెడ్యూల్ అనంతరం సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరోవైపు కంగన స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపంచనుంది. కంగనతో పాటూ అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాఖ్ నైర్, శ్రేయస్ తాల్పడే ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. 

Tags:    

Similar News