T BJP chief: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా శోభా కరంద్లాజే
కమలం పార్టీ వ్యూహాలు;
ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ల నియామకం కోసం బీజేపీ.. ఎన్నికల ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు 29 మందితో కూడిన లిస్టును బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణకు ఎలక్షన్ ఆఫీసర్‌గా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌కు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటకకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బిహార్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు.
కమలం పార్టీ వ్యూహాలు
వచ్చేది అంత ఎన్నికల హడావుడి కావడంతో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయడంతో పాటు ప్రజలకు మరింత దగ్గర కావడం కోసం కమలం పార్టీ మరిన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జనవరి లేదా ఫ్రిబవరిలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ సర్పంచ్‌లను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలోనే విధానాలను అవలంభిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్‌లకు దాదాపు రూ. వెయ్యి కోట్లు బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. వాటి కోసం సర్పంచ్‌లు ఏళ్ల తరబడి ఏదురు చూస్తున్నారు. అలాగే 2026లో గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. వీటన్నింటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది.