KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత తిరుగుబాటు..!

ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు ఎమ్మెల్సీ మద్దతు;

Update: 2025-07-18 02:00 GMT

బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి ఎమ్మె­ల్సీ కవిత ఊహిం­చ­ని షాక్ ఇచ్చా­రు. ఇం­టి­పా­ర్టీ­పై కవిత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల కోసం ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన ఆర్డి­నె­న్స్ కరె­క్టే అని.. బీ­ఆ­ర్ఎ­స్ వా­ళ్ళు ఆర్డి­నె­న్స్ వద్ద­ని చె­ప్తు­న్నా­రు.. అది తప్పు అని కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. బీ­ఆ­ర్ఎ­స్ వా­ళ్ళు మె­ల్ల­గా తన దా­రి­కి రా­వా­ల్సిం­దే అని చె­ప్పా­రు. ‘బీసీ రి­జ­ర్వే­ష­న్‌­పై ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన ఆర్డి­నె­న్స్ కరె­క్టే. బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­లు ఆర్డి­నె­న్స్ వద్ద­ని చె­ప్ప­డం సరి­కా­దు. బీ­ఆ­ర్ఎ­స్ వా­ళ్ళు నా దా­రి­కి రా­వా­ల్సిం­దే. నా­లు­గు రో­జు­లు టైం తీ­సు­కుం­టా­రే­మో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డి­నె­న్స్ తే­వ­డం సబబే. నేను న్యా­య­ని­పు­ణు­ల­తో చర్చిం­చిన తర్వా­తే ఆర్డి­నె­న్స్‌­కు సపో­ర్ట్ చే­శా­ను. అలా­గే, తీ­న్మా­ర్ మల్ల­న్న నాపై చే­సిన ఆరో­ప­ణ­ల­పై బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­లు స్పం­దిం­చ­క­పో­వ­డం వారి వి­జ్ఞ­త­కే వది­లే­స్తు­న్నా­ను. ఒక ఎమ్మె­ల్సీ గు­రిం­చి ఎంత తక్కువ మా­ట్లా­డి­తే అంత మం­చిం­ది. ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్ మల్ల­న­ను నేను జనా­భా లె­క్కల నుం­చి తీ­సి­వే­శా­ను అన్నా­రు. ఆయన ఎవరో నాకు తె­లి­య­దు’ అంటూ ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఈ వ్యా­ఖ్య­ల­తో ఎమ్మె­ల్సీ కవిత, కే­టీ­ఆ­ర్ మధ్య దూరం పె­రు­గు­తు­న్న­ట్లు కని­పి­స్తోం­ది. అన్నా­చె­ల్లాల మధ్య గ్యా­ప్ రా­వ­డా­ని­కి కా­ర­ణా­లు ఏంటి అనే­ది ఇప్ప­టి­కి ఇంకా తె­లి­య­రా­లే­దు.

కమీషన్ల కోసమే బనకచర్ల..

బన­క­చ­ర్ల­పై చర్చ­కు తాను వె­ళ్ల­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి మే­క­పో­తు గాం­భీ­ర్యం ప్ర­ద­ర్శిం­చా­రని కవిత అన్నా­రు. "డి­ల్లీ సమా­వే­శం­లో ఎజెం­డా­లో మొ­ద­టి అం­శ­మే బన­క­చ­ర్ల. ము­ఖ్య­మం­త్రి, మం­త్రి ఉత్త­మ్ సి­గ్గు­లే­కుం­డా గో­దా­వ­రి జలా­ల­ను చం­ద్ర­బా­బు చే­తి­లో పె­ట్టా­రు. బన­క­చ­ర్ల­పై చర్చే జర­గ­లే­ద­ని రే­వం­త్ రె­డ్డి బు­కా­యి­స్తు­న్నా­డు. తె­లం­గాణ హక్కు­ల­ను కా­ల­రా­సిన నాన్ సీ­రి­య­స్ ము­ఖ్య­మం­త్రి తన పదవి రా­జీ­నా­మా చే­యా­లి. బన­క­చ­ర్ల వల్ల ఆం­ధ్రా ప్ర­జ­ల­కు ఏం లాభం లేదు. కాం­ట్రా­క్ట­ర్లు, కమి­ష­న్ల కోసం బన­క­చ­ర్ల కడు­తు­న్నా­రు. ము­ఖ్య­మం­త్రి మెగా కం­పె­నీ వాటా కో­స­మే డి­ల్లీ­కి వె­ళ్లా­రు. చం­ద్ర­బా­బు ఎజెం­డా­లో భా­గం­గా­నే సీఎం డి­ల్లీ­కి వె­ళ్ళా­డు. బన­క­చ­ర్ల ఆప­క­పో­తే న్యా­య­పో­రా­టం చే­స్తాం." అని కవిత అన్నా­రు. పా­ర్ల­మెం­ట్ సమా­వే­శా­లు జర­గ­బో­తు­న్న నే­ప­ధ్యం­లో ము­ఖ్య­మం­త్రి అఖి­ల­ప­క్షా­న్ని ఢి­ల్లీ­కి తీ­సు­కు­వె­ళ్లా­ల­ని కవిత డి­మాం­డ్ చే­శా­రు. గో­దా­వ­రి నీ­ళ్ల­ను చం­ద్ర­బా­బు­కు గి­ఫ్టు­గా ఇచ్చా­ర­ని కవిత ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. " తక్ష­ణ­మే సీఎం పద­వి­కి రే­వం­త్ రె­డ్డి రా­జీ­నా­మా చే­యా­లి. నా­లు­గు వి­జ­యా­లు సా­ధిం­చా­మ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి గొ­ప్ప­లు చె­ప్పు­కుం­టు­న్నా­రు.

Tags:    

Similar News