KAVITHA: కవిత చేజారుతున్నతెలంగాణ జాగృతి..!

తెలంగాణ జాగృతికి కవితను దూరం చేసే వ్యూహాలు!.. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి కీలక నేతల..?... తెలంగాణ జాగృతిలో ఇప్పటికే ముసలం ఆరంభం

Update: 2025-09-12 04:30 GMT

తె­లం­గా­ణ­లో కల్వ­కుం­ట్ల కు­టుంబ రా­జ­కీ­యం.. అనూ­హ్య మలు­పు­లు తి­రు­గు­తోం­ది. హరీ­శ్‌­రా­వు­పై కవిత సం­చ­లన వి­మ­ర్శ­లు.. ఆ తర్వాత బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి కవిత సస్పెం­డ్ వంటి అనూ­హ్య పరి­ణా­మా­ల­తో ఇప్పు­డు తె­లం­గా­ణ­లో అం­ద­రి దృ­ష్టి కల్వ­కుం­ట్ల కు­టుం­బం­పై కేం­ద్రీ­కృ­త­మైం­ది. బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్.. కవిత పట్ల మరిం­త­గా కఠి­నం­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­ర­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ఇప్ప­టి­కే కవి­త­ను పా­ర్టీ నుం­చి సస్పెం­డ్ చే­సిన కే­టీ­ఆ­ర్… తా­జా­గా ఆమె స్థా­పిం­చిన తె­లం­గాణ జా­గృ­తి సం­స్థ­ను కూడా ఆమె నుం­చి లా­గే­సు­కు­నే యత్నా­ల­కు పదు­ను పె­ట్టా­ర­న్న వాదన వి­ని­పి­స్తోం­ది. అం­దు­లో భా­గం­గా ఇప్ప­టి­కే తొలి అడు­గు కూడా పడిం­ద­ని... జా­గృ­తి ఏర్పా­టు సం­ద­ర్భం­గా కవి­త­తో పాటు కీ­ల­కం­గా వ్య­వ­హ­రిం­చిన పలు­వు­రు నే­త­ల­ను కే­టీ­ఆ­ర్ రం­గం­లో­కి దిం­చా­రు. కే­టీ­ఆ­ర్ రం­గం­లో­కి దిం­పిన నే­త­ల్లో రా­జీ­వ్ సా­గ­ర్, రా­జా­రాం యా­ద­వ్, మఠం బి­క్ష­ప­తి ఇప్ప­టి­కే కవి­త­కు వ్య­తి­రే­కం­గా గళ­మె­త్తా­రు. బీ­ఆ­ర్ఎ­స్ కు రా­జీ­నా­మా చేసి తమను నడి­రో­డ్డు­పై పడే­సిం­ద­ని కొం­ద­రు జా­గృ­తి నే­త­లు ఆరో­పి­స్తు­న్నా­రు. అసలు ఎవ­రి­ని అడి­గి కవిత ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­ర­ని సూ­టి­గా ప్ర­శ్నిం­చా­రు. జా­గృ­తి ఆవి­ర్భా­వం­లో కవి­త­తో కలి­సి సా­గా­మ­ని, సం­స్థ­లో కవి­త­కు ఎంత పా­త్ర ఉందో తమకూ అంతే పా­త్ర ఉం­ద­ని ఈ నే­త­లు చె­ప్పు­కొ­చ్చా­రు. అయి­తే ఈ నా­య­కుల వె­నుక కే­టీ­ఆ­ర్ ఉన్నా­డ­ని... ఆయనే వీ­రి­తో మా­ట్లా­డి­స్తు­న్నా­ర­న్న ఆరో­ప­ణ­లు కూడా ఉన్నా­యి.

ఏకాకిగా మారిన కవిత

కే­సీ­ఆ­ర్ ము­ద్దుల త‌­న­‌­య‌, ఎమ్మె­ల్సీ క‌­ల్వ­‌­కుం­ట్ల క‌­విత ప్ర­స్తు­తం ఏకా­కి­గా మి­గి­లి­న­ట్లు కని­పి­స్తోం­ది. అన్నా­చె­ల్లె­ళ్ల మ‌­ధ్య వి­భే­దా­లు బ‌­జా­ర్న ప‌­డ్డా­యి. బీ­ఆ­ర్ఎ­స్ వ‌­ర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ అయిన త‌న అన్నే లే­ఖ­‌­ను లీక్ చే­శా­ర­‌­ని ఆమె అను­మా­ని­స్తు­న్నా­రు. కే­టీ­ఆ­ర్, తనకు మధ్య గ్యా­ప్ ఉం­ద­నే రీ­తి­లో గతం­లో కవిత వ్యా­ఖ్య­లు ఉన్నా­యి. పా­ర్టీ­లో తనకు ప్రా­ధా­న్యం లే­కుం­డా చే­శా­ర­నే భా­వ­న­తో ఆమె ఉన్నా­ర­నే ప్ర­చా­రం గట్టి­గా సా­గిం­ది. అది ని­జ­మే­న­ని­పిం­చే­లా కవిత కూడా స్వం­తం­గా జా­గృ­తి ద్వా­రా కా­ర్య­క­లా­పా­లు సా­గిం­చా­రు. ఈ సమ­యం­లో పా­ర్టీ వైపు నుం­చి కానీ, కు­టుం­బం వైపు నుం­చి కూడా ఆమె­కు పె­ద్ద­గా మద్ద­తు లభిం­చ­లే­దు. క‌­వి­త­‌­కు మాజీ మం­త్రి హ‌­రీ­ష్‌­రా­వు స్ట్రాం­గ్ కౌం­ట­‌­ర్ ఇచ్చా­రు. బీ­జే­పీ­లో బీ­ఆ­ర్ఎ­స్ వి­లీ­నం అబ­‌­ద్ధ­‌­పు ప్ర­‌­చా­ర­‌­మ­‌­ని ఆయ‌న క‌­వి­త­‌­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని స‌­మా­ధా­నం ఇచ్చా­రు. అలా­గే కా­వా­ల­‌­నే కొం­ద­‌­రు బీ­ఆ­ర్ఎ­స్ వి­లీ­నం అవు­తుం­ద­‌­నే త‌­ప్పు­డు ప్ర­‌­చా­రం చే­స్తు­న్నా­ర­‌­ని క‌­వి­త­‌­కు ప‌­రో­క్షం­గా చు­ర­‌­క­‌­లు అం­టిం­చా­రు. కే­సీ­ఆ­ర్ కు­టుం­బం­తో తం­డ్రి మొ­ద­‌­లు­కు­ని, ఇత‌ర కు­టుంబ స‌­భ్యు­లె­వ­‌­రూ క‌­వి­త­‌­కు మ‌­ద్ద­‌­తు­గా లే­ర­‌­నేం­దు­కు హ‌­రీ­ష్‌­రా­వు కౌం­ట­‌­రే ని­ద­‌­ర్శ­‌­నం. కే­సీ­ఆ­ర్‌­కు హ‌­రీ­ష్‌­రా­వు, సం­తో­ష్‌­రా­వు అత్యంత న‌­మ్మ­‌­క­‌­స్తు­ల­‌­ని పా­ర్టీ వ‌­ర్గా­లు చె­బు­తుం­టా­యి. క‌­విత ధి­క్కార ధో­ర­‌­ణి­పై కు­టుంబ స‌­భ్యు­లం­తా ఒకే మా­ట­‌­పై ఉన్నా­ర­‌­ని అం­టు­న్నా­రు. అం­దు­కే క‌­విత బీ­ఆ­ర్ఎ­స్‌­లో ఒం­ట­‌­రి­గా మి­గి­లా­ర­‌­ని, ఈ ఒత్తి­డి­లో రా­ను­న్న రో­జు­ల్లో ఆమె మ‌­రి­న్ని సం­చ­‌­ల­‌­నా­ల­‌­కు కేం­ద్రం కా­వ­‌­చ్చ­‌­నే ప్ర­‌­చా­రం జ‌­రు­గు­తోం­ది.

Tags:    

Similar News