TG : అరవొద్దని కేసీఆర్ సైగలు.. హుందాగా రేవంత్ తీరు

Update: 2025-03-13 10:30 GMT

మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్ అని, ఇప్పటి వరకు 149.63 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని గవర్నర్ ప్రసంగించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు చరిచారు. అదే విధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చెల్లింపు, సన్న బియ్యానికి రూ. 500 బోనస్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు, మూసీ పునరుజ్జీవం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ కులగణనతో పాటు ఈ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవ ర్నర్ ప్రస్తావించినప్పుడు అధికార పక్ష సభ్యులు చప్పట్లు చరిచారు. అదే విధంగా రైతు భరోసా విషయం ప్రస్తావి స్తున్నప్పుడు విపక్ష బీఆర్ఎస్ సభ్యులు షేమ్ షేమ్ అని అరిచారు. గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ సభ్యుడు కౌషిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా ఆరుస్తుండడంతో పలుమార్లు కేసీఆర్ ఆరవొద్దని సైగలు చేశారు. అయినప్పటికీ, కౌషిక్ రెడ్డి తన పంథాను వీడకుండా అరుస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ సభ్యులు అరుపులు, కేకలు కొనసాగిస్తున్నప్పుడు కాంగ్రెస్ పక్షం నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు. ఈ సందర్భంగా సీఎంలో అసహనం కనిపించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ధీమాగా కూర్చున్నారు. గతంలో శాసనసభ నుంచి పలుమార్లు సస్పెండ్ చేయించిన కేసీఆర్ సభకు హాజరుకావడం, ఆయన ముందు సీఎంగా సభలో ఉండటంతో రేవంత్ ఆనందంగా కనిపించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా, ఆనుసరిస్తూ నోట్ చేసుకున్నారు. కొన్నిసార్లు చప్పట్లు చరిచి కాంగ్రెస్ సభ్యులను ప్రోత్సహించారు. సభ ముగిసిన తర్వాత ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులతో కొద్దిసేపు సీఎం ముచ్చటించారు.

Tags:    

Similar News