జూబ్లీహిల్స్ ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయన నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. పైగా ఒక్క మీటింగ్ కూడా పెట్టట్లేదు. పార్టీ నేతలతో ఎలాంటి సమావేశాలు నిర్వహించట్లేదు. ఆ మధ్యన జూబ్లీహిల్స్ నేతలతో ఒక మీటింగ్ నిర్వహించారు. దాని తర్వాత మళ్లీ ఒక్క రివ్యూ కూడా పెట్టట్లేదు. వాస్తవానికి కెసిఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ముందు పార్టీ నిర్ణయించింది. పార్టీ నేతలు, కింది స్థాయి కార్యకర్తల డిమాండ్ మేరకు కేసిఆర్ ప్రచారం చేయాలి అనుకున్నాడు.
కానీ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. వ్యూహత్మకంగానే ఈ ఉపఎన్నికకు కేసిఆర్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసినా.. మాగంటి సునీత ఓడిపోతే.. ఆ అపవాదు తనమీదకు వస్తుందనే ఉద్దేశంతో కేసిఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రి చనిపోవడంతో ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతను మొత్తం కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ లో గులాబీ పార్టీ గెలిస్తే.. ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లడం ఖాయం. అప్పుడు కెసిఆర్ తన వ్యూహాలతో కేటీఆర్ ను హైలైట్ చేయాలని భావిస్తున్నారంట. బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ చాలా బలమైన నాయకుడు అనే ముద్రపడేలా చేయాలని కేసిఆర్ భావిస్తున్నారు.
ఒకవేళ బిఆర్ఎస్ ఓడిపోయిన ఎక్కువ ఓట్ల తేడాతో సునీత ఓటమి చెందదు అని.. అప్పుడు ఆ ఓటమిని ఎలాగోలా కవర్ చేయొచ్చు అనుకుంటున్నారు గులాబీ పార్టీ అధినేత. అందుకే ఈ ఎన్నికలకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూనే.. కావలసిన వ్యూహాలను అందిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుందో ఫామ్ హౌస్ నుంచే పరిశీలిస్తూ.. దిశా నిర్దేశం చేస్తున్నారు. కెసిఆర్ వ్యూహాల ప్రకారమే కేసీఆర్ ఇతర నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన ప్రైవేటు కంపెనీలు, మున్సిపల్ శాఖ పరమైన అభివృద్ధి, యాదవులకు ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు, ఇక్కడ కులాలకు సంబంధించిన కుల సంఘాల కట్టడాలు, తమ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా కేసీఆర్ వ్యూహాలు అందించారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు పలుస్తాయో చూడాలి.