TS : కేసీఆర్ ను మించిన దాదా కేటీఆర్.. బండి సంజయ్ ఎటాక్

Update: 2024-05-11 08:41 GMT

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది.. దాదాగిరి చేసింది కేటీఆరే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.

కేసీఆర్ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఇక్కడి నేతన్నల దుస్థితికి వాళ్లిద్దరే కారణమన్నారు.

“కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. అదే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా" అని ఛాలెంజ్ చేశారు బండి సంజయ్. హోరాహోరీ ప్రచారం ముగింపుకు రావడంతో కరీంనగర్ లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేశారు ఈసీ అధికారులు.

Tags:    

Similar News