లగ్జరీ కార్ల స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం..? - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

Update: 2025-09-22 08:27 GMT

బీఆర్‌ఎస్ పార్టీ అక్రమంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లపై నడుస్తోందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. లగ్జరీ కారు స్కామ్‌లో నిందితుడు బసరాత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్‌ కారులో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ కారు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేరు మీద ఎందుకు రిజిస్టర్ అయిందని కూడా ఆయన నిలదీశారు.

బండి సంజయ్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు:

కారు ఎవరిది? లగ్జరీ కారు స్కామ్‌లో నిందితుడు బసరాత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు ప్రయాణిస్తున్నారు?

రిజిస్ట్రేషన్ వివరాలు: ఈ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్ల మీద ఎందుకు రిజిస్టర్ అయ్యాయి?

కొనుగోలు విలువ: ఈ కార్లకు మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారా?

చెల్లింపులు:చెల్లింపులు బినామీ పేర్ల మీద జరిగాయా? నకిలీ ఆదాయం ద్వారా లేదా మనీలాండరింగ్ ద్వారా ఈ కొనుగోళ్లు జరిగాయా?

ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తోందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయాలపై వాస్తవాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు తక్షణమే దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News