గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. గతంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవని అన్నారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో ఆమె మాట్లాడారు.
వందల ఎకరాలు ఉన్నవారికి ప్రజాధనం అప్పనంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఇప్పుడు అందరి అంగీకారంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. కొండా సురేఖ విమర్శలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.