Cell Torch Operation : సెల్ టార్చ్ వెలుగులోనే డెలివరీ ఆపరేషన్..
Cell Torch Operation : సెల్ టార్చ్ వెలుతురులో డెలివరీ ఆపరేషన్ చేసిన ఖమ్మం వైద్యులు
Cell Torch Operation : ఖమ్మం జిల్లా అడవిమల్లెల పీహెచ్‌సీలో సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో వైద్యులు గర్భిణీకి పురుడు పోశారు. గత రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో...అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి...పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని తీసుకువచ్చారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పీహెచ్‌సీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ సైతం మొరాయించటంతో...చేసేదిలేక సెల్‌ఫోన్ వెలుగులోనే గర్భిణీకి పరుడు పోశారు. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యులకు స్థానికులు, కుటుంబసభ్యులు కృతజ్ఞత తెలిపారు.
అడవిమల్లెల పీహెచ్‌సీలో.. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో గర్భిణీకి పురుడు
రాత్రి భారీ వర్షం సమయంలో... అడవిమల్లెల పీహెచ్‌సీకి గర్భిణీ తరలింపు
ఆపరేషన్ సమయంలో నిలిచి విద్యుత్ సరఫరా
సెల్‌ఫోన్ టార్జ్ వెలుతురులోనే...గర్భిణీకి పురుడు పోసిన వైద్యులు
తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన సిబ్బంది