Kishan Reddy : తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు? : కిషన్‌రెడ్డి
Kishan Reddy : డబ్బా ఇళ్లు వద్దన్న తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.;
Kishan Reddy : డబ్బా ఇళ్లు వద్దన్న తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణలో ఎన్ని ఇళ్లు కట్టినా.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. పీఎం కిసాన్ కింద 21వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని రోజులు ప్రగతిభవన్‌లో ఉంటారో కూడా తెలియదని విమర్శించారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహిస్తామని చెప్పారు.