పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలిసే ప్రయత్నం చేయోద్దన్నారాయన.;
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలిసే ప్రయత్నం చేయోద్దన్నారాయన. తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనన్నారు కోమటిరెడ్డి. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందన్నారు. పీసీసీని ఇంఛార్జ్ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీగా మారిందన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానన్నారు కోమటిరెడ్డి. తన రాజకీయ భవిష్యత్‌ను, కార్యకర్తలు నిర్ణయిస్తారన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌పై విమర్శలు, ఆరోపణలు చేయబోనన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కొత్త కార్యవర్గాన్ని అభినంధిస్తూనే హుజారాబాద్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. కాంగ్రెస్ కూడా టీటీడీపీ మాదిరిగానే మారుతుందన్నారు. రేపట్నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానన్నారు. ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తానన్నారు. నల్లగొండ జిల్లాలో ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. పార్లమెంట్‌లో ఎంపీగా గళం వినిపిస్తామన్నారు.