సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. మల్లన్న కల్యాణోత్సవానికి 30వేల వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఆలయవర్గాలు తెలిపాయి. కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక వద్ద మరో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నూతన క్యూలైన్ల నిర్మాణం చేపట్టడడంతో రాజగోపురం వద్ద చలువ పందిళ్ల్లతో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పా ట్లు చేశారు. నూతనంగా నిర్మించిన భవనంలో ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతి కల్పిస్తున్నారు