హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి పేరు ఖరారు..?
Congress: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.;
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా సురేఖ పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. సోనియా ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరు ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి.. ముగ్గురి పేర్లను ఫైనల్ చేశారు. ఆ నివేదికను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేశారు. దామోదర రాజనర్సింహా రిపోర్టులో ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి అందించిన రిపోర్టుతో ఢిల్లీ బయల్దేరారు ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్. త్వరలోనే హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.