సింగరేణిని ప్రైవే టీకరించేందుకు కేంద్రం కుట్ర చే స్తోందని.. అందుకే బొగ్గు గనులను వేలం వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు.
కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) కుమ్మక్కైయ్యారని ఆయన విమర్శించారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యే లు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘాలతో గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరపున పోరాటం చేసి సింగరేణిని కాపాడుకుంటామని ఆయన తెలిపారు.