బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ‘యాత్ర గురించి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించాను. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటాను. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తాను’ అని వెల్లడించారు.
అంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.