సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనీ.. తన బంధువుకు వెయ్యి కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడని కేటీఆర్ ట్విట్టర్ పోస్టులో అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తీ రేవంత్ రెడ్డి అనీ.. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడని ఘాటుగా పోస్టు పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓ ఫేక్ న్యూస్ పెడ్లర్ అనీ.. ఆయన్ను జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు కేటీఆర్. దీనిని బీఆర్ఎస్ సపోర్టర్స్ వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ సపోర్టర్స్ దీనికి కౌంటర్ కామెంట్లు పెడుతున్నారు.