KTR: ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి.. లేదంటే చూస్తూ ఊరుకోం: కేటీఆర్
KTR: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ అన్నారు మంత్రి కేటీఆర్.;
KTR: ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ అన్నారు మంత్రి కేటీఆర్.. రాజకీయ భావదారిద్ర్యంతో మాట్లాడటం మంచిది కాదన్నారు.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. ఇక నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకుల్లో తెలంగాణకు రెండో ర్యాంక్ వచ్చిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.. పల్లె ప్రగతిలో, సంసద్ అర్షద్ యోజనలో పదికి పది ఉత్తమ గ్రామాలు తెలంగాణ ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చెబుతోందన్నారు.. పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చొరవ చూపాలన్నారు కేటీఆర్.