KTR : బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు..

Update: 2025-08-12 13:30 GMT

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత రెండు రోజుల క్రితం ఈ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే ఫోన్లు ట్యాప్ చేసారని...దీనిపై గుడిలో ప్రమాణం చెయ్యాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అంతే కాకుండా.. మీ చీకటి రహస్యాలు బయటపడితే.. దాక్కోవడానికి చోటు కూడా మిగలదు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఇక ఈ అంశంపై తాజాగా స్పందించిన కేటీఆర్ బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని... పబ్లిక్ లో తనపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని తన నోటీసులో పేర్కొన్నారు కేటీఆర్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని ...రాజకీయ ఉనికి కోసమే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి...

Tags:    

Similar News