తెలంగాణలో రైతులను సీఎం రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని మండిపడ్డారు BRS నేతలు. గత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న సీఎం మళ్ళీ డిసెంబర్ వచ్చిన రుణమాఫీ చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. వంచించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల BRS ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాద యాత్ర కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టర్ కార్యాలయం వరకు జరుగనుంది. అన్నదాతలకు అండగా ఉంటామంటూ సుమారు 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చేపడుతున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తిలకం దిద్ది ప్రారంభించారు. పాదయాత్రలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.