జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు. కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్‌ఐగా పనిచేశారు.
ఇదిలా ఉంటే..
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ ని లారీ అత్యంత వేగంగా వచ్చే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.