భూముల మార్కెట్ విలువను ఏ మేరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉండగా, అపార్టుమెంట్ల విలువను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల విషయానికి వస్తే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో వాస్తవ ధరలు ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట పెంపు ఉండొచ్చంటున్నారు.
2021-22లో వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధరను ప్రభుత్వం ₹75వేలుగా నిర్ధారించింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్య స్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంచింది. ఖాళీ స్థలాలకు ధరలు తక్కువగా ఉన్న చోట 50%, మధ్య స్థాయిలో ఉంటే 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంపు అమలు చేసింది. కొత్త మార్కెట్ విలువలను TG భూముల సవరణ మార్గదర్శకాలు-1998, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఖరారు చేయనుంది.