LOCAL WAR: తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
తొలిరోజు 5,063 నామినేషన్లు దాఖలు... నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం
తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో సర్పంచి పదవులకు 3,242, వార్డు పదవులకు 1,821 ఉన్నాయి. నిబంధనల ప్రకారం... ఎన్నికల వ్యయ పరిశీలన కోసం అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఎకౌంట్ ఉండాలి. దీంతో అభ్యర్థులంతా బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు పాన్ కార్డును అడుగుతున్నారు. చాలామందికి పాన్ లేకపోవడంతో ఖాతాలు తెరవలేకపోయారు. పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరిచేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినా... చాలా గ్రామాల్లో అవి లేవు. మరోవైపు నామినేషన్లకు ఈ నెల 29 వరకే గడువుంది.
ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పించొచ్చు. ఈ నెల 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకు ముందుగా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆ వెంటనే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించారు. తొలిదశలో 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29 వరకు కొనసాగనుంది. ఈ నెల 30 నామినేషన్ల పరిశీలన చేపడతారు.
ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామిషన్లు తిరస్కరించారు? ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.. అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్యం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు లెక్కింపు చేపడ్తారు. మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఎన్నికలకు నామినేషన్లను ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు స్వీకరిస్తారు. ఈ దశలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.