Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ను కలిసిన మల్లన్నసాగర్ బాధితులు
పరిహారం కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు రైతులు. బాధితులకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన వారిని ఆదుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్కార్ తమ భూములు బలవంతంగా తీసుకొని పరిహారం ఇవ్వలేదన్నారు భాధితులు. మంత్రి ఉత్తమ్ కుమార్ తో భేటీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కలిశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు అన్నారు.