Rangareddy District : షాద్ నగర్‌లో మాంజా తగిలి భార్య, భర్తలకు తీవ్ర గాయాలు
పతంగి మాంజా దారం తగిలి భార్యభర్తలకు గాయాలు అయిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగింది. రంగనాథ్ తన భార్యతో కలిసి బైక్ పై ముచ్చింతల్ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పతంగి మాంజా గొంతుకు తాకి గాయాలయ్యాయి. మాంజాను తొలగించే ప్రయత్నం చేసిన రంగనాథ్ భార్య చేతులకు కూడా గాయాలు అయ్యాయి. తన భార్య మాంజాను తొలగించడంతో గాయాలతో బయటపడ్డానని.. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేదని వాపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో వారికి హాస్పిటల్ లో చికిత్స అందుతోంది. అటు వ్యాపారులు.. ఇటు పిల్లలు ఇలాంటి ప్రమాకరమైన చైనా మంజాలు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అధికారులు కూడా దీనిపై నిఘా పెట్టి మార్కెట్ లో చైనా మాంజాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.