TG : నేనూ గాంధీ ఆస్పత్రిలోనే జన్మించా : మంత్రి దామోదర రాజనర్సింహా

Update: 2024-09-04 06:45 GMT

తానూ గాంధీ ఆస్పత్రిలోనే పుట్టానని.. ఇక్కడికి వచ్చే పేద రోగుల కష్​టాలు తనకు తెలుసని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మంగళవారం ఆయన గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీతో పాటు వార్డులలో తిరుగుతూ వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది సాధారణ ప్రజలని, దొరలెవరూ ఇక్కడికి రారన్నారు. వీళ్లకు క్వాలిటీ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. మెడికల్ ఆఫీసర్లు,డాక్టర్లు, ఇతర స్టాఫ్​ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. ‘దొరలకు రోగమొస్తే కార్పొరేట్ హాస్పిటళ్లకు పోతరు. మా వాళ్లే ఇక్కడికొస్తరు. వాళ్ల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. గాంధీలో అన్ని వసతులు కల్పిస్తాం. ఇక్కడికొచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తాం’ అని మంత్రి వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో వారంలోగా ఐవీఎఫ్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి దామోదర పేర్కొన్నారు. మెడికోల హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. పేషెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని స్టాఫ్​ కు సూచించారు. పేషెంట్లకు అందించే ఫుడ్ క్వాలిటీగా ఉండాలన్నారు. అటెండర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డీఎంఈవో డాక్టర్ వాణి, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ఉన్నారు.

Tags:    

Similar News