బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది -మంత్రి హరీష్
Harish Rao: బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు.;
బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని.. మంత్రి హరీష్ రావు అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలు గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. కేంద్రం దేశాన్ని నాశనం చేసిందన్నారు. ఇక హుజురాబాద్‌లో అసలు బీజేపీ వాళ్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించిన హరీష్‌రావు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. మరోవైపు దళిత బంధు హుజురాబాద్‌లో వద్దని ఈటల అంటున్నారన్న హరీష్.. దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మిపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుపు పక్కా అని తెలిపారు.