తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా కేసీఆర్ తీర్చిదిద్దారు : హరీష్‌రావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి అంటే.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని కేసీఆర్ పిలుపునిచ్చారని.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు.;
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి అంటే.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని కేసీఆర్ పిలుపునిచ్చారని.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. కోటి 25 లక్షల ఎకరాల్లో పంట పండించే దిశగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి.. దేశంలోనే అత్యధిక ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిందని అన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా దళిత బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ రూపొందించారని హరీష్‌రావు చెప్పారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా సిద్ధిపేటలో జరిగిన వేడుకల్లో హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.