Harish Rao : తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడంతో సిద్దిపేట దశ-దిశ మారింది: హరీష్ రావు
Harish Rao : తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సిద్దిపేట దశ,దిశ మారిందన్నారు మంత్రి హరీష్ రావు.;
Harish Rao : తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సిద్దిపేట దశ,దిశ మారిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట శివారు నాగులబండ దగ్గర 19 కోట్ల 44 లక్షల రూపాయలతో నిర్మించిన హరిత త్రి-స్టార్ హోటల్‌ను మంత్రి ప్రారంభించారు. ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే వారికి హరిత హోటల్ ఉపయోగపడుతుందన్నారు. టూరిజం హోటల్ పక్కనే వందలాది మందికి ఉపాధినిచ్చే ఐటీ టవర్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రం గుణాత్మక మార్పు సాధిస్తుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.