హుజురాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు శ్రీకారం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీఠ వేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్‌లో పర్యటించిన ఆయన... ఎస్సార్‌ఎస్పీ కెనాల్ వద్ద ఆటోనగర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.;
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీఠ వేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్‌లో పర్యటించిన ఆయన... ఎస్సార్‌ఎస్పీ కెనాల్ వద్ద ఆటోనగర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పలువురు లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన లాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. బీజేపీకి ఓటేస్తే... గ్యాస్ ధర వెయ్యి నుంచి 15 వందల రూపాయలు అవుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు... ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.