కేంద్రం వడ్లు కొనడం ఆపొద్దు.. రైతుల ఉసురు తియ్యొద్దు : మంత్రి కేటీఆర్‌

Minister KTR : ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ సిరిసిల్లలో జరుగుతున్న ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.;

Update: 2021-11-12 09:37 GMT

Minister KTR : ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ సిరిసిల్లలో జరుగుతున్న ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగడంతోపాటు వరి దిగుబడి కూడా పెరిగిందని, ఐతే కేంద్రం తీరు వల్లే ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అష్టకష్టాలు పడే పరిస్థితి వచ్చిందని TRS ఆరోపిస్తోంది. యాసంగిలో ధాన్యమంతా కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం వడ్లు కొనడం ఆపొద్దని, రైతుల ఉసురు తియ్యొద్దని KTR ప్లకార్డులు పట్టి మరీ నిరసన తెలిపారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్‌ మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 

Tags:    

Similar News