ప్రతి పేద వ్యక్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి కేటీఆర్
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.;
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందించామన్నారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా పట్టించుకోనవసరం లేదని అన్నారు. కొందరు పదవులు రాగానే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ఎన్నిక అయినా.. ప్రజలు టీఆర్ఎస్‌నే ఆదరిస్తారన్నారు.